Sunday, October 21, 2007

మా తొలి అడుగు:

మేము అనుకున్న లక్ష్యాలను సాధించుకోవడానికి ఏకైక మార్గం మొదటగా విధ్యార్థులలో రక్తదానం పై అవగాహన ఏర్పరచడం అందుకోసం మేము మా గ్రామంలోని జూనియర్ కళాశాలకు వెళ్ళి అక్కడి విధ్యార్థులలో రక్తదానం పై అవగాహన కల్పించి వారి నుండి స్వతహాగా రక్తదానం చేయడానికి ఇష్ట పడిన విధ్యార్థులను అహ్వానించగా మంచి స్పందన వచ్చింది.

ముందుకు వచ్చిన విధ్యార్థుల కోసం మేము రక్త పరీక్ష శిబిరాన్ని నిర్వహించి వారిని మా అసోషియేషన్ లో శాశ్విత సభ్యునిగా చేసుకున్నాము, ఈ విధంగా మా అసోషియేషన్ కు 100 మంది శాశ్విత సభ్యులుగా ప్రస్తుతము వున్నారు.

2 comments:

Anonymous said...

మీ ఆశయం ఉన్నతమైనది.ఆపత్సమయంలో రక్తం దొరకక ఎన్ని ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయో ఒక వైద్యునిగా నాకు తెలుసు.మీ సంస్థ దినదినాభివృద్ధిచెంది మరిన్ని ప్రాణ(రక్త)దానాలు చేయాలి...శుభాకాంక్షలు.

Unknown said...

hi this is ur veeru all the best