Sunday, January 6, 2008

ప్రొత్సాహం

మేము చేస్తున్న ఈ రక్తదాన కార్యక్రమానికి మెచ్చిన కొందరు దాతలు మా కోసం కొంత సహాయం చేస్తున్నారు.

1. అసోషియేషన్ అన్నాక ఏదైనా ఒక శాశ్విత గుర్తింపు వుండాలనే తలంపుతో మా గురువుగారు శ్రేయోభిలాషి అయినటువంటి శ్రీ శ్రీనివాస మూర్తి గారు (ఉపాధ్యాయులు)మా అసోషియేషన్ నందు గల అందరు సభ్యులకు డ్రెస్ కోడ్ నిభందన పాటించాలని సూచిస్తూ సదరు సూచనకు అయ్యే ఖర్చులన్నింటికీ కలిపి మొత్తం మూడు వేల రూపాయలు అందించారు.
2. రక్తదానం కోసం మేము నెలలో కనీసం పది సార్లు అయినా అరవై కిలోమీటర్లు ప్రయాణించవలసి వుంటుంది దీని దృష్ట్యా మా ఊరి బస్సు యాజమాని అయిన శ్రీ కే. రహమతుల్లా గారు వారి బస్సు నందు పావగడ మరియు శిరా వైపు ఇద్దరు ప్రయానించుటకు శాశ్విత ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు.