Monday, December 10, 2007

ప్రతిజ్ఞ

ఈ భారతావనిలో పుట్టిన నేను,
నాకు జన్మనిచ్చిన తల్లితండ్రులను,
నా అభ్యున్నతికి కారకులైన గురువులను,
నా దేశంలో వున్న ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ,
రాయల్ యూత్ అసోసియేషన్ లోని ప్రతి ఒక్క
సభ్యునితో మర్యాదగా నడుచుకుంటూ
మానవ సేవయే మాధవ సేవ అనే నానుడితో
ఆపదలో వున్న తోటి మానవునికి నా చేతనైన
సాయం చేసి, రాయల్ యూత్ అసోసియేషన్
అభివృద్ధికి కారకుడిగా ప్రతిక్షణం శ్రమిస్తానని,
ఈ భూదేవి సాక్షిగా, ఆ భగవంతుని సాక్షిగా
మన స్పూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను.

--- కే. పి. నగేష్ బాబు

ప్రతీ ఒక్క ఆర్గనైజేషన్ కు తమకంటు ఒక ఉద్దేశ్యం వుంటుంది, అదే విధంగా మా అసోసియేషన్ కు ప్రతిజ్ఞ వుండాలనే ఉద్దేశ్యంతో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వారి స్వహస్తాక్షరాలతో మా కోసం వ్రాసిన మా ప్రతిజ్ఞ.

అసలు వీరు డాక్టర్లేనా ?

హాయ్ బ్లాగర్లు చాల రోజులకు మీ ముందుకు మరోసారి వచ్చాము, అందరికి నమస్కారం .

ఈ రోజు మన భారతదేశం ఎంత ముందుకు వచ్చింది అంటే మన అభివృద్ధి కేవలం డబ్బు సంపాదనతోనే జరుగుతుంది అంతేకాని తోటి మానవునికి కనీస సహాయం చేయాలనే ఆలోచన మాత్రం సగటు మానవుడిలో ఈ రోజు లోపించింది.

కొన్ని రూజుల క్రితం మాకు ఒక ఫోన్ కాల వచ్చింది, బి పాజిటివ్ గ్రూప్ గల రక్తం కావాలని అది కూడా 04 యూనిట్లు కావాలని, మేము ఎంతో కష్టపడి డబ్బు జతచేసుకుని మా వూరినుండి ఆసుపత్రికి వెళ్ళాము, ఆక్కడ వున్న రోగిని చూసి మాకు చాలా బాధ వేసింది. రోగికేమో జాండేస్ తీవ్రంగా వుంది దాంతో అతని శరీరంలో రక్తం వుండల్సిన స్థాయిలో లేదు అంతేకాకుండ ఆ రోగి చాలా బీదవాడు, అతని తరుపు మనుషులు బ్రతికించుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు, ఆ ఆసుపత్రి గురించి చెప్పే కంటే డైరెక్ట్ గా స్మశానములో పరిస్థితి ఎలా వుంటుందో మీరె ఆలోచించుకోవచ్చు.

మేము ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తం పరీక్షకు ఇస్తే వాళ్ళు ఇప్పుడు చెక్ చేయడం కుదరదు రేపు రండి రిపోర్టు ఇస్తామన్నారు, ఇక్కడ చూస్తే రోగి పరిస్థితి చాలా దారుణంగా వుండడం వలన, మాకు తిరిగి మా వురికి రావడానికి బస్సులు లేకపోవడం వలన,ఆ రోగి తరుపు మనుషులు ప్రవేటు ఆసుపత్రులలో ప్రయత్నించగా ఆ సిబ్బంది కనీసం జాలి,దయాగుణం, చూపించకపోవడం, మాకు చాలా భాద కలిగించింది.

ప్రవేటు ఆసుపత్రిలోని డాక్టర్లను కలవగా మా దగ్గర స్టోర్ చేయడానికి బ్యాంక్ లేదు, రక్తం డ్రా చేయడనికి కిట్ లేదు, మా దగ్గర సిబ్బంది లేదు అని చెప్పారే కాని కనీస బాద్యత ఏమి అనేది మరిచి పోయారు మన వారు.

సదరు రోగికి రక్తం ట్రాన్సలేట్ చేయడనికి అయ్యే ఖర్చు కేవలం 250 రూ. మాత్రమే అది కూడా లాస్ చేసుకోవడం మన డాక్టర్లకు ఇష్టం లేదు పాపం.
ఇదయ్యా మన డాక్టర్ల సంగతి.
మా చివరి విన్నపం :
అయ్యా భూలోక దేవుళ్ళు కనీసం రోజుకొకసారి అయినా పేద రోగికి సహాయపడండి.

Thursday, November 1, 2007

మరో అడుగు

మేము అషోషియేషన్ ప్రారంభించిన తరువాత మొట్ట మొదటి సారిగా రక్తదానం చేయడం జరిగింది, మా ఊరి ప్రక్కన వున్న గ్రామస్థురాలికి రక్తం అవరమై మా వద్దకు వచ్చినప్పుడు (A+ గ్రూపు) మా ఆసోషియేషన్ తరుపునుండి మా స్వంత ఖర్చులతో రక్తదాతను మా గ్రామం నుండి 48 కిలోమీటర్ల దూరంలోగల పావగడకు వెళ్ళి రక్తాన్ని అందించి వచ్చినాము. ఇది మా అసోషియేషన్ తొలి విజయం.

Sunday, October 21, 2007

మా తొలి అడుగు:

మేము అనుకున్న లక్ష్యాలను సాధించుకోవడానికి ఏకైక మార్గం మొదటగా విధ్యార్థులలో రక్తదానం పై అవగాహన ఏర్పరచడం అందుకోసం మేము మా గ్రామంలోని జూనియర్ కళాశాలకు వెళ్ళి అక్కడి విధ్యార్థులలో రక్తదానం పై అవగాహన కల్పించి వారి నుండి స్వతహాగా రక్తదానం చేయడానికి ఇష్ట పడిన విధ్యార్థులను అహ్వానించగా మంచి స్పందన వచ్చింది.

ముందుకు వచ్చిన విధ్యార్థుల కోసం మేము రక్త పరీక్ష శిబిరాన్ని నిర్వహించి వారిని మా అసోషియేషన్ లో శాశ్విత సభ్యునిగా చేసుకున్నాము, ఈ విధంగా మా అసోషియేషన్ కు 100 మంది శాశ్విత సభ్యులుగా ప్రస్తుతము వున్నారు.

అసోషియేషన్ ఫౌండర్స్ :

కుర్రకారు వీరు ఏమి చేస్తారులే అనుకున్న వారందరికి నోరు మూసుకునేలా చేసింది మానవుడికి కనీస ఇంకిత జ్ఞానం ఏ విధంగా వుండాలనేది నేర్పాలనుకున్నది, సమాజంలో తన ప్రక్కనున్న సాటి మనిషిని ఆదుకోవాలై అనే ఆలోచనను తెలిపినది కేవలం రెండు పదులు దాటని వయస్సు గల ముగ్గురు
కుర్రాళ్ళు మాత్రమే వారి పేర్లు

1. కే. పి. నగేష్

2. జి. ఈ. ఈరణ్ణ

3. కే. ఆర్. రాహిత్

నిజంగా వీరిలో ఇంత సేవా తపన గత మూడు సంవత్సరాలది, వీరికి తోడుగా నమ్మకమైన సంఘం రాయల్ యూత్ అసోషియేషన్ ఆవిర్భావం.

Saturday, October 20, 2007

మా ఆశయం :

మా ఊరిలో ఎన్నో యువ సంఘాలు వున్నాయి కాని, అవి అన్నీ కేవలం పండుగలు పబ్బాలప్పుడు మాత్రమే కనుబడుతాయి, అంతెందుకు ఎక్కడైనా మీరే చూడండి గల్లీ కొక వినాయక సంఘం, యాదవ సంఘం, వాల్మీకి సంఘం, సెహరీ సంఘం, ఇలా గల్లీకొక సంఘాలు ఏర్పడి పండుగలప్పుడు భారీగా బ్యానర్ లు, డ్రెస్సులు, మందు బాబులు కలసి కావలసినంత గొప్పలు జరుపుకుంటారు.

మా ఊరి విషయములో కూడా అదే సంగతి జరిగింది, మా ఊరిలో గ్రామ పొలిమేలరనుండి చివరి దాకా యాదవ సంఘాలు, వినాయక సంఘాలు, వాల్మీకి సంఘాలు, సెహరీ సంఘాలు చాలా వున్నాయి ఇవి అన్నీ తమ తమ బడాయిలు లంగించి అదౄశ్యం అయిపోతుంటాయి. ఇక మా యువక సంఘం వద్దకు వస్తే...........
మా అసోషియేషన్ కు ఒక ఆశయం వుంది,

"చిన్నగా బ్రతికినా చాలా గొప్పగా బ్రతకాలి"

దీనికి మా వద్ద వివరణ కూడా వుందండి.


మా అసోషియేషన్ లో వున్న సభ్యులందరూ మధ్య తరగతి, బీద కుటుంబం నుండి వచ్చిన వారమే, మేం చెప్పుకోడానికి ఆర్థికంగా గొప్ప కాలేక పోయినా, ఆపత్ సమయంలో ఆదుకునేందుకు కాసింత మనసు ఇచ్చాడు ఆ దేవుడు, అందుకే మా ఆశయాన్ని చిన్నగా అంటె మేము బీదవారమైనా చాలా గొప్పగా అంటే కాసింత నిస్పాక్షికమైన సేవా చేసి బ్రతకాలని అనుకుంటున్నాము.

మరీ మీరు కూడా మా గ్రామీణ రక్తదాతల సమాహారాన్ని ముందుకు విజవంతంగా తీసుకెళ్ళండని ఆశిర్వదించండి.

Wednesday, October 17, 2007

మా లక్ష్యాలు :

1. రక్తదానం చేయడానికి సిద్దపడిన వ్యక్తికి ఉచిత గ్రూపింగ్ చేయించడం :
ఎవరైతే రక్తదానం చేస్తామని స్వతహాగా ముందుకు వస్తారో అలాంటి వారికోసం మేము ఉచితంగా పూర్తి జాగ్రత్తలతో బ్లడ్ గ్రూపింగ్ తెలియ పరుస్తాము. మా వద్ద ఒక్క సారి బ్లడ్ గ్రూపింగ్ కు సిద్ద పడిన వ్యక్తి మరి ఎలాంటి పరిస్థితులలోను తన నిర్ణయాన్ని మార్చుకోరాదు. (రక్తదానం చేసే సంధర్భములో వెనుకంజ వేయడం)




2. రక్తదానం గురించి అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం :
మేము పుర్తిగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నాము, కావున రక్తదానం గురించి ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు ఎటువంటి అవగాహన లేకపోవడం వలన, రక్తదానం చేయడం వలన కలిగే మంచి గురించి ప్రజలలో ఎక్కువగా అవగాహనా సదస్సులను జరుపుతుంటాము. ముఖ్యంగా కాలేజి విధ్యార్థులను ఉపయోగించుకుని మా లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నాము.



3. ప్రతీ గ్రామములోను రక్తదాతలను సిద్దం చేయడం : (క్లోజ్డ్ నెట్ వర్క్) :
ఎదో ఒక ఊరిలో రక్త దాతలను సిద్దం చేయడం వారి సేవలను వినియోగించుకోవడం వలన మేము అనుకున్న లక్ష్యాలను చేరడం సులభ తరం కాదు, అందుకోసం మేము మా మండలములోని అన్ని గ్రామాలలోనూ రక్తదాతలను సిద్దం చేసి తద్వారా ఆపదలో వున్న మనిషికి మా ప్రమేయం లేకుండా వారే తగిన సహాయం అందించుకునేలా చేయాలని నిశ్చయించాము.



4. ప్రాణాపాయ స్థితిలోవున్న వ్యక్తికి రక్తం అందించేందుకు సిద్ధపడిన రక్తదాతకు తగిన పూర్తి జాగ్రత్తలు ఎర్పాటు చేయడం :

మేము నివసిస్తున్న మండలములోని ప్రజలలో ఎక్కువగా బీద కుటుంబాల వారే మా అసొషేయేషన్ లోని సభ్యులు కూడా ఆర్థికంగా వెనుకబడిన వారే కావడం వలన, ఎవరైనా అత్యవసర పరిస్థితులలో వున్న వారికి రక్తం అందించడానికి సిద్ద పడితే అలాంటి రక్త దాతకు ప్రయాణించడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము.


యువత

ప్రపంచాన్ని విచ్చిన్నం చేయలన్నా, అదే ప్రంపంచాన్ని ఏకతాటిపైకి తేవాలన్నా యువతదే ప్రధాన భూమిక.

ఈ మాటలే స్పూర్తిగా ప్రమాద స్థితిలో, అత్యవసర పరిస్థితిలో వున్న తన తోటి మానిషిని ఆదుకోవలెననే సదుద్దేశ్యంతో అమరాపురం గ్రామము నందు "రాయల్ యూత్ అసోషియేషన్" ఊపిరి పోసుకుంది.

పై వాక్యాలకు మా చిన్న వివరణ : (విచ్చిన్నం చేయడంలో మన పాత్ర)

ఇక్కడ యువత గురించి చెప్పుకోవలసిన ముఖ్యమైన అంశం ఒకటి వుంది :
మన దేశానికి ఒక చిహ్నముంది (కనిపించే మూడు సింహాలు) వీటిని మూడు రకాలుగా మనం వర్గీకరించుకుంటే, మొదటి సింహం ఏమో రాజకీయం, రెండవ సింహం ఏమో అధికారులు, మూడవ సింహం వచ్చి ఉగ్రవాదం, ఈ మూడు సింహాల భవిష్యత్తు కేవలం కనబడని నాలుగో సింహం అయిన యువతదే.

రాజకీయం కోసం : మొదటి సింహం అయిన రాజకీయాలు (నాయకులు) వీరికి మేము ఎప్పుడు వెన్నంటి వుండాలి ఎలెక్షన్ లలో, పార్టి మీటింగ్ లలో, గొడవలలో, మొదలగు సంధర్భాలలో యువతలేనిదే వీరు ఒక్క అడుగు కూడ ముందుకు వేయలేరు అంతెందుకు కాలేజీల్లొ పుట్ట గొడుగుల్లా విధ్యార్థి సంఘాలు వున్నాయంటే కేవలం నాయకుల ప్రయోజనార్థమే కాని యువత భవిష్యత్తు కోసం కాదు. వాళ్ళకు అవసరమైనంత వరకు మనల్ని బాగా ఉపయోగించుకొని వెనక్కి నెట్టేస్తారు.

అధికారుల కోసం : వీరికి యువత అంతగా సహకరించక పోయినా, నిరుద్యోగులపై మాత్రం వీరి కన్ను ఎప్పుడూ వుంటుంది.

ఉగ్రవాదం కోసం :దీని కోసం మనం ఎంత శ్రమిస్తున్నామంటే స్వయాన మనల్ని మనం చంపుకుంటున్నా పక్కవాడిని చంపుతున్నాం. మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా తీవ్రవాదం చెలరేగిందంటే అది కేవలం యువత ప్రాధాన్యమే, ఈ రోజు ఓ చోట బాంబు పేలి దాని తీవ్రతకు ఎంతో మంది బలౌతున్నారు, ఈ కేసుల్లో చిక్కినవారందరు కేవలం యువత మాత్రమే కాని ఏ ముసలివాడో మరే చిన్న వయస్సు పిల్లవాడో కాదు.

మరి వీళ్ళందరూ మన దేశ వినాశనం కోసం మనల్ని ఇంతగా ఉపయోగించుకుని వెనక్కు నెట్టుతుంటె వూరికే వండడం తప్ప మరేమి చేయలేక పోతున్నాం.

యువత ముందు చెడు దారిలో ప్రయాణించడానికి ఇష్టపడుతూన్నారు, అందులో గాయం తగిలాకా తన తప్పు తెలుసుకుని ఏం లాభం.

(ప్రపంచాన్ని ఏకతాటిపైకి తేవడంలో మన పాత్ర)

ఇంతగా ఈ మూడు సింహాలు మనల్ని ఉపయోగించుకుని మా ఉనికి లేకుండా చేస్తున్నప్పుడు, ఒక్క సారి ఆలోచించండి ఈ మూడు సింహాలకు బదులు మన దేశానికి చిహ్నంగా కేవలం ఒకే ఒక్క సింహం వుంటే ఎలా వుంటుందో, అంటే దేశానికి రాజకీయాలు వద్దు, అధికారులు వద్దు, ఉగ్రవాదం వద్దు, కేవలం సమ సమాజ శ్రేయస్సు కోరుతు యువత ముందుకు వస్తే మన దేశం ఎలా వుంటుంది.

అదే ఆలోచనతో ఈ రోజు మేము (అమరాపురం లెజెండ్స్) ఏ ఒక్క రాజకీయ అండ, అధికార తోడు, ఉగ్రవాదం జోరు లేకుండా "రాయల్ యుత్ అసోషియేషన్" గా ఒక్కటైనాము. So lets Build a peace ful World