Monday, December 10, 2007

ప్రతిజ్ఞ

ఈ భారతావనిలో పుట్టిన నేను,
నాకు జన్మనిచ్చిన తల్లితండ్రులను,
నా అభ్యున్నతికి కారకులైన గురువులను,
నా దేశంలో వున్న ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ,
రాయల్ యూత్ అసోసియేషన్ లోని ప్రతి ఒక్క
సభ్యునితో మర్యాదగా నడుచుకుంటూ
మానవ సేవయే మాధవ సేవ అనే నానుడితో
ఆపదలో వున్న తోటి మానవునికి నా చేతనైన
సాయం చేసి, రాయల్ యూత్ అసోసియేషన్
అభివృద్ధికి కారకుడిగా ప్రతిక్షణం శ్రమిస్తానని,
ఈ భూదేవి సాక్షిగా, ఆ భగవంతుని సాక్షిగా
మన స్పూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను.

--- కే. పి. నగేష్ బాబు

ప్రతీ ఒక్క ఆర్గనైజేషన్ కు తమకంటు ఒక ఉద్దేశ్యం వుంటుంది, అదే విధంగా మా అసోసియేషన్ కు ప్రతిజ్ఞ వుండాలనే ఉద్దేశ్యంతో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వారి స్వహస్తాక్షరాలతో మా కోసం వ్రాసిన మా ప్రతిజ్ఞ.

అసలు వీరు డాక్టర్లేనా ?

హాయ్ బ్లాగర్లు చాల రోజులకు మీ ముందుకు మరోసారి వచ్చాము, అందరికి నమస్కారం .

ఈ రోజు మన భారతదేశం ఎంత ముందుకు వచ్చింది అంటే మన అభివృద్ధి కేవలం డబ్బు సంపాదనతోనే జరుగుతుంది అంతేకాని తోటి మానవునికి కనీస సహాయం చేయాలనే ఆలోచన మాత్రం సగటు మానవుడిలో ఈ రోజు లోపించింది.

కొన్ని రూజుల క్రితం మాకు ఒక ఫోన్ కాల వచ్చింది, బి పాజిటివ్ గ్రూప్ గల రక్తం కావాలని అది కూడా 04 యూనిట్లు కావాలని, మేము ఎంతో కష్టపడి డబ్బు జతచేసుకుని మా వూరినుండి ఆసుపత్రికి వెళ్ళాము, ఆక్కడ వున్న రోగిని చూసి మాకు చాలా బాధ వేసింది. రోగికేమో జాండేస్ తీవ్రంగా వుంది దాంతో అతని శరీరంలో రక్తం వుండల్సిన స్థాయిలో లేదు అంతేకాకుండ ఆ రోగి చాలా బీదవాడు, అతని తరుపు మనుషులు బ్రతికించుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు, ఆ ఆసుపత్రి గురించి చెప్పే కంటే డైరెక్ట్ గా స్మశానములో పరిస్థితి ఎలా వుంటుందో మీరె ఆలోచించుకోవచ్చు.

మేము ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తం పరీక్షకు ఇస్తే వాళ్ళు ఇప్పుడు చెక్ చేయడం కుదరదు రేపు రండి రిపోర్టు ఇస్తామన్నారు, ఇక్కడ చూస్తే రోగి పరిస్థితి చాలా దారుణంగా వుండడం వలన, మాకు తిరిగి మా వురికి రావడానికి బస్సులు లేకపోవడం వలన,ఆ రోగి తరుపు మనుషులు ప్రవేటు ఆసుపత్రులలో ప్రయత్నించగా ఆ సిబ్బంది కనీసం జాలి,దయాగుణం, చూపించకపోవడం, మాకు చాలా భాద కలిగించింది.

ప్రవేటు ఆసుపత్రిలోని డాక్టర్లను కలవగా మా దగ్గర స్టోర్ చేయడానికి బ్యాంక్ లేదు, రక్తం డ్రా చేయడనికి కిట్ లేదు, మా దగ్గర సిబ్బంది లేదు అని చెప్పారే కాని కనీస బాద్యత ఏమి అనేది మరిచి పోయారు మన వారు.

సదరు రోగికి రక్తం ట్రాన్సలేట్ చేయడనికి అయ్యే ఖర్చు కేవలం 250 రూ. మాత్రమే అది కూడా లాస్ చేసుకోవడం మన డాక్టర్లకు ఇష్టం లేదు పాపం.
ఇదయ్యా మన డాక్టర్ల సంగతి.
మా చివరి విన్నపం :
అయ్యా భూలోక దేవుళ్ళు కనీసం రోజుకొకసారి అయినా పేద రోగికి సహాయపడండి.